55రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె తర్వాత రెండ్రోజుల ఉత్కంఠకు కేసీఆర్ ప్రకటనతో తెరపడింది. ఎలాంటి షరతులు లేకుండా విధులకు హాజరు కావచ్చనే ప్రకటనకు కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని డిపోలో విధులకు హాజరయ్యారు. సీఎం కేసీఆర్ పెద్ద దిక్కుగా కార్మికుల సంక్షేమం కోసం రూ. వంద కోట్లు కేటాయించి విధుల్లోకి తిరిగి తీసుకోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
విధులకు హాజరవుతున్న ఆర్టీసీ కార్మికులు - tsrtc employees joined in duty at mancherial
ఎలాంటి షరతులు లేకుండా సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులను విధులకు హాజరు కావొచ్చని కేసీఆర్ ప్రకటించగా... మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి హాజరవుతున్నారు.
![విధులకు హాజరవుతున్న ఆర్టీసీ కార్మికులు tsrtc employees joined in duty at mancherial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5212792-thumbnail-3x2-join.jpg)
విధుల్లోకి హాజరవుతున్న ఆర్టీసీ కార్మికులు