తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీమే సవాల్​: మంచిర్యాలలో గులాబీ గుబాళింపు

మంచిర్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. మంచిర్యాల, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూరు, నస్పూర్​, క్యాతన్​పల్లి మున్సిపాలిటీలను తెరాస కైవసం చేసుకుంది. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో తెరాస జోరు కొనసాగింది.

trs-won-in-machiryala-district
బస్తీమే సవాల్​: మంచిర్యాలలో గులాబీ గుబాళింపు

By

Published : Jan 25, 2020, 4:32 PM IST

బస్తీమే సవాల్​: మంచిర్యాలలో గులాబీ గుబాళింపు

మంచిర్యాలలో 36 వార్డులకు ఫలితాలు వెలువడ్డాయి. తెరాస 21 స్థానాల్లో విజయం సాధించింది. 14 వార్డుల్లో కాంగ్రెస్​ అభ్యర్థులు గెలిచారు. భాజపా , ఎంఐఎం, స్వతంత్రులు ఖాతా తెరవలేదు. మంచిర్యాల ఛైర్మన్​ పీఠాన్నితెరాసదక్కించుకుంది.

బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులకు గానూ... తెరాస 25, కాంగ్రెస్​02, భాజపా 01, ఇతరులు 06 స్థానాలు గెలుచుకున్నారు. బెల్లంపల్లి పురపాలికలోనూ తెరాస 25 స్థానాల అధిక్యంతో ఛైర్మన్​ పీఠాన్ని దక్కించుకుంది. లక్షెట్టిపేట మున్సిపాలిటీలో 15 వార్డులకు గానూ తెరాస 10, కాంగ్రెస్​ 04, ఇతరులు 01 స్థానాన్ని గెలుచుకుంది. భాజపా, ఎంఐఎం ఖాతా తెరవలేదు. లక్షెట్టిపేటలో తెరాస ఛైర్మన్​ పీఠాన్ని కైవసం చేసుకుంది.

చెన్నూరులో 18 వార్డులకు గానూ... తెరాస 16, ఇతరులు 02 గెలుచుకున్నాయి. చెన్నూరులో తెరాసనే ఛైర్మన్​ పీఠాన్ని కైవసం చేసుకుంది.నస్పూరు 25 వార్డులకు గానూ... తెరాస 10, కాంగ్రెస్​ 06, భాజపా 03, ఇతరులు 06 స్థానాల్లో గెలుచుకున్నాయి. నస్సూరు ఛైర్మన్​ పీఠాన్ని తెరాస గెలుచుకుంది.క్యాతన్​పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గానూ తెరాస 19, కాంగ్రెస్​ 01, ఇతరులు 02 స్థానాలు గెలుచుకున్నాయి. క్యాతన్​పల్లిలోనూ తెరాస ఛైర్మన్​ పీఠాన్ని గెలుచుకుంది.

మొత్తం మంచిర్యాల జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో తెరాస ఛైర్మన్​ పీఠాన్ని కైవసం చేసుకుంది. దీనితో జిల్లాలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details