రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో కారు స్పీడు పెంచి అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పురపాలికను తెరాస కైవసం చేసుకుంది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో అత్యధిక వార్డుల్లో గులాబీ పార్టీ గెలుపొందింది.
బెల్లంపల్లిలోని 34 వార్డుల్లో 25 స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేసింది. 2 వార్డుల్లో కాంగ్రెస్, భాజపా 1, స్వతంత్ర అభ్యర్థులు 6 స్థానాలు కైవసం చేసుకున్నారు. బెల్లంపల్లి పురపాలిక పరిధిలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.