మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణానికి చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి, మంచిర్యాల శాసనసభ్యులతో పాటు మంచిర్యాల జిల్లా జెడ్పీ ఛైర్మన్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్రం సిద్ధించాకే ప్రజలకు అన్నీ రకాల మౌలిక సదుపాయాలు అందుతున్నాయని వెల్లడించారు. తుమ్మిడిహట్టి వద్ద లేదా వార్ధా నది పైన ప్రాజెక్టు నిర్మాణం చేసి మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులకు సాగు నీరందిస్తామని తెలిపారు.
మంచిర్యాల తెరాస జిల్లా కార్యాలయానికి భూమి పూజ - బాల్క సుమన్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెరాస పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో భవన నిర్మాణానికి చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ భూమిపూజ చేశారు.
మంచిర్యాల తెరాస భవన నిర్మాణానికి భూమి పూజ