మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెరాస నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిగెల నాగేశ్వరరావు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని దుర్గం చిన్నయ్య కోరారు. కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి చేరవేయాలని కోరారు.
బెల్లంపల్లిలో తెరాస విస్తృతస్థాయి సమీక్ష - తెరాస సమావేశం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో తెరాస నియోజకవర్గ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటుచేయాలని సూచించారు.
బెల్లంపల్లిలో తెరాస విస్తృతస్థాయి సమీక్ష
Last Updated : Sep 13, 2019, 6:22 PM IST
TAGGED:
తెరాస సమావేశం