బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక ఆర్మీని తయారు చేశారని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ అన్నారు. ఆయన 125వ జయంతిని పురస్కరించుకుని సురేఖ.. తన నివాసంలో నేతాజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
'భారతీయుల గుండెల్లో నేతాజీ ఎప్పటికీ చిరస్మరణీయమే..' - మంచిర్యాల కాంగ్రెస్ అధ్యక్షురాలు సురేఖ
నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సురేఖ తన నివాసంలో.. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జైహింద్ నినాదంతో ప్రతి ఒక్క భారతీయుని గుండెల్లో సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారని ఆమె అన్నారు.
!['భారతీయుల గుండెల్లో నేతాజీ ఎప్పటికీ చిరస్మరణీయమే..' tributes to nethaji subhash chandrabose](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10351222-174-10351222-1611396941420.jpg)
నేతాజీ 125వ జయంతి, మంచిర్యాల
నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయిందని ఆమె అన్నారు. 'జైహింద్' నినాదంతో ప్రతి ఒక్క భారతీయుని గుండెల్లో సుభాష్ చంద్రబోస్ బతికే ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.