గత రాత్రి నుంచి వర్షం, ఈదురు గాలుల బీభత్సానికి మంచిర్యాల జిల్లాలో ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేలకూలాయి. మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులు ప్రజా రవాణా పునరుద్ధరణ కోసం సహాయక చర్యలు చేపట్టారు. మంచిర్యాల ట్రాఫిక్ సీఐ ప్రవీణ్, ఎస్సై మధుసూధన్ తమ సిబ్బందితో రహదారులకు అడ్డంగా పడిన చెట్లను తీసివేస్తూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చేశారు.
రోడ్లపై కూలిన వృక్షాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు - trees collapsed on the roads
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈదురు గాలుల వల్ల రోడ్డుపై కూలిన చెట్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సహాయక చర్యలు చేపట్టారు.
రోడ్లపై కూలిన వృక్షాలను తొలగించిన ట్రాఫిక్ పోలీసులు