కరోనా వ్యాధిగ్రస్థుల్లో మనోధైర్యం నింపి అండగా నిలుస్తున్నారు మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజు. తమ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సుధాకర్ భార్యకి కరోనా సోకడం వల్ల పరిస్థితి విషమంగా మారింది. విషయం తెలిసిన రాజు.. ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి సుధాకర్ తో పాటు అతని భార్యను పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా తామున్నామంటూ మనోధైర్యం నింపారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందేలా చూశారు.
కరోనా వ్యాధిగ్రస్థుల్లో మనోధైర్యం నింపుతున్న సీఐ రాజు - మంచిర్యాల వార్తలు
కరోనా సోకిన వారిని ఆమడ దూరం నుంచి చూడడానికి కూడా ముందుకు రాని భయానక పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఈ విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ బారిన పడిన వారి కుటుంబ సభ్యులకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.రాజు అండగా నిలుస్తున్నారు.
Traffic CI raju, mancherial news
డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో.. పోలీస్ సిబ్బంది ఆరోగ్య రక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు సీఐ తెలిపారు. తోటి సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఆపదలో ఉన్న సమయంలో కొండంత ధైర్యాన్ని ఇచ్చిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఔదార్యం పట్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:మహమ్మారితో పోరాడుతున్న పోలీసులు, వైద్యులు