బంద్కు వర్తక సంఘం మద్దతు.. - తెలంగాణ బంద్
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన రాష్ట్ర బంద్కు మంచిర్యాల జిల్లాలో వ్యాపారులు, వర్తక సంఘం యాజమానులు స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.

రాష్ట్ర బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించిన వర్తక సంఘం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన తెలంగాణ బంద్ మంచిర్యాల జిల్లా మందమర్రి లో ప్రశాంతంగా కొనసాగుతోంది. వ్యాపారస్తులు, వర్తక సంఘం యాజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాలు మూసేసి సంఘీభావం తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మూసి ఉన్న దుకాణాలను ఓపెన్ చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
రాష్ట్ర బంద్కు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించిన వర్తక సంఘం