పేదలకు న్యాయం చేసేందుకే నూతన రెవెన్యూ చట్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారని తెరాస ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. కొత్త చట్టం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా తెరాస ఆధ్వర్యంలో ట్రాక్టర్ల ర్యాలీ చేపట్టారు. ఎంపీ వెంకటేష్ నేతతో పాటు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
'కొత్త రెవెన్యూ చట్టం చరిత్రాత్మకం' - తెలంగాణ తాజా వార్తలు
కొత్త రెవెన్యూ చట్టానికి మద్దతుగా మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. పేదలకు న్యాయం చేసేందుకే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారని అన్నారు.
'కొత్త రెవెన్యూ చట్టం చరిత్రాత్మకం'
పట్టణంలోని పోచమ్మ ఆలయం నుంచి బజార్ ఏరియా మీదుగా కన్నాల బస్తీ రైల్వే పై వంతెన వరకు ర్యాలీ కొనసాగింది. కాంటా చౌరస్తా నుంచి కాల్ టెక్స్ రైల్వే పై వంతెన మీదుగా కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:నూతన రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్ల ర్యాలీ
Last Updated : Sep 28, 2020, 11:33 AM IST