మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మండలం బొక్కలగుట్ట గ్రామంలో అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఎనిమిది మందిని రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు టాస్క్‌ఫోర్స్ సీఐ కిరణ్ వెల్లడించారు.
అక్రమ మట్టి తవ్వకాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు - మంచిర్యాల జిల్లా తాజా సమాచారం
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్న ఎనిమిది మందిని రామగుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా బొక్కలగుట్ట గ్రామంలో దాడులు చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అక్రమ మట్టి తవ్వకాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు
ఈ దాడుల్లో ఎనిమిది ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ తవ్వకాలు చేపట్టడం చట్టరీత్యా నేరమని సీఐ తెలిపారు. ఈ దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంపత్‌కుమార్, భాస్కర్‌గౌడ్, ఓంకార్, రాకేష్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి:బంగాళాఖాతంలో వాయుగుండం.. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు
Last Updated : Oct 11, 2020, 9:12 PM IST