పొలంలో ట్రాక్టర్ బోల్తా... యువ రైతు మృతి - today accidents news in telangana
ట్రాక్టర్ తో పొలంలో పనులు చేస్తుండగా... ప్రమాదవశాత్తు బోల్తాపడి ఓ యువరైతు ప్రాణాలు కోల్పోయిన ఘటన మంచిర్యాల జిల్లా సీతారాంపల్లిలో చోటుచేసుకుంది.
పొలంలో ట్రాక్టర్ బోల్తా... యువ రైతు మృతి
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లిలో ఓ యువరైతు తన వ్యవసాయ భూమిలో ట్రాక్టర్ తో పొలం పనులు చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ట్రాక్టర్ కింద పడిన రామును బయటకుతీసేసరికే ప్రాణాలు కోల్పోయాడు. ట్రాక్టర్ పొలం గట్లపైకి వెళ్లడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.