తెలంగాణ

telangana

ETV Bharat / state

రెవెన్యూ వ్యవస్థలో నవశకం ప్రారంభమైంది: బాల్క సుమన్‌ - రెవెన్యూ చట్టానికి మద్దతుగా ట్రాక్టర్ల భారీ ర్యాలీ చెన్నూరు

రాష్ట్ర రెవెన్యూ వ్యవస్థలో నవశకం ప్రారంభమైందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గ రైతులతో కలిసి.. 400 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ నిర్ణయానికి సంఘీభావం తెలిపారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం నుంచి కిష్టంపేట జోడువాగుల వరకు 15 కిలోమీటర్లు ఈ కార్యక్రమం సాగింది.

రెవెన్యూ వ్యవస్థలో నవశకం ప్రారంభమైంది: బాల్క సుమన్‌
రెవెన్యూ వ్యవస్థలో నవశకం ప్రారంభమైంది: బాల్క సుమన్‌

By

Published : Sep 23, 2020, 9:17 PM IST

తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో నవశకం ప్రారంభమైందని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అభిప్రాయపడ్డారు. శతాబ్దాలనాటి చట్టాల బూజు దులుపుతూ.. అవినీతి రహిత వ్యవస్థే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని రూపొందించారని కొనియాడారు. తరతరాలుగా ప్రజలు అనుభవిస్తున్న బాధలకు చరమగీతం పాడి.. రైతులకు, నిరుపేదలకు అండగా నిలిచే విధంగా రెవెన్యూ చట్టం ఉందని.. యావత్ తెలంగాణ ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు.

ట్రాక్టర్లతో భారీగా తరలిన రైతన్నలు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజక వర్గ రైతులతో కలిసి బాల్క సుమన్.. 400 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ నిర్ణయానికి సంఘీభావం తెలిపారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం నుంచి కిష్టంపేట జోడువాగుల వరకు 15 కిలోమీటర్లు ఈ కార్యక్రమం సాగింది. నూతన రెవెన్యూ చట్టం చారిత్రాత్మక నిర్ణయం అని సుమన్‌ కొనియాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృ తంగా వినియోగించుకోవడం వల్ల పారదర్శకత ఏర్పడుతుందన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రైతన్నలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ 500 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details