తెల్లారిన బతుకులు..రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతి
06:08 May 15
బైకును ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. ముగ్గురు దుర్మరణం
మంచిర్యాల జిల్లా మందమర్రిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టగా.. అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. సుజాత, కావ్యలు తల్లి కూతురు. బెల్లంపల్లి మండలం పెరకపల్లి గ్రామంలో జరిగిన బారసాల కార్యక్రమానికి వారిద్దరు వచ్చారు. వేడుక అనంతరం వీరిని ఇంటి వద్ద దిగపెట్టేందుకు కొమురయ్య.. బైకుపై వెళ్లారు.
మందమర్రి వద్ద గుర్తుతెలియని వాహనం వీరిని ఢీకొట్టగా.. ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఏసీపీ రెహ్మాన్, మందమర్రి సీఐ మహేష్ ప్రమాదానికి గల కారణాన్ని ఆరా తీశారు. సీసీ కెమెరాల ద్వారా ప్రమాదానికి పాల్పడిన వాహనాన్ని గుర్తిస్తామని సీఐ తెలిపారు. మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి:ఆ అడవి నాదే..ఈ నగరం నాదే.
TAGGED:
road accident in mandamarri