తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణికి తాకినా కరోనా సెగ - సింగరేణిలో కరోనా కేసులు

రాష్ట్రంలో రోజురోజుకు విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి... ఇప్పుడు సింగ‌రేణిలోనూ క‌ల్లోలం రేపుతోంది. గ‌ని కార్మికుల్లో ఆందోళ‌న మొద‌లైంది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు తగు నివారణ చ‌ర్య‌లు చేప‌ట్టారు.

Three Corona positive cases in Singareni Calories
సింగరేణికి తాకినా కరోనా సెగ

By

Published : Jun 14, 2020, 10:47 PM IST

మంచిర్యాల జిల్లాలో ఆదివారం మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్​లో ఏఎస్సై, విశ్రాంత సింగరేణి కార్మికులకు కొవిడ్​-19 పాజిటివ్​గా నిర్ధారణ అయింది. అప్రమత్తమైన అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. బొగ్గు గనులలో భౌతికదూరం పాటించడం సాధ్యం కాకపోవటం వల్ల మరింతమంది సింగరేణి కార్మికులకు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details