మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లిలో చింత విష్ణువర్ధన్ పొలాన్ని దమ్ము చేస్తుండగా ఒక్కసారిగా ట్రాక్టర్ పైకి లేచింది. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై పక్కకు దూకాడు.
బురదలో ట్రాక్టర్ పైకి లేచింది - mancherial District Gollapalli Latest News
కేజీ వీల్స్‌తో పొలంలో దమ్ము చేస్తుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా పైకి లేచింది. ప్రమాదవశాత్తు డ్రైవర్ తప్పించుకున్నాడు. ఈ కారణంగా మంచిర్యాల జిల్లాలో ఇప్పటికే నలుగురు చనిపోయారు. కేజీ వీల్స్ పడితే డ్రైవర్లు బతికిన ఘటనలు లేవని స్థానికులు చెబుతున్నారు.
![బురదలో ట్రాక్టర్ పైకి లేచింది The tractor rise in the mud at gollapalli mancherial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8530763-605-8530763-1598199115725.jpg)
బురదలో ట్రాక్టర్ పైకి లేచింది
ట్రాక్టర్ పైకి లేచి అలాగే ఆగిపోయింది. ట్రాక్టర్ లేచే సమయంలో డ్రైవర్ ఒక్కసారిగా కిందకు దూకాడు. వీల్స్ తనపై పడితే ప్రాణాలు పోయేవని గ్రామస్థులు చెబుతున్నారు. ఇది తనకు పునర్ జన్మ అని విష్ణువర్ధన్ అంటున్నాడు.
ఇదీ చూడండి :గుండెపోటుతో తెరాస నేత మృతి.. మంత్రి సత్యవతి కంటతడి