మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో మత సామరస్యానికి ప్రతీకగా రెండు రోజులుగా జరుగుతున్న సయ్యద్-షా-బాబా ఉర్సు ఉత్సవాలు గురువారం రాత్రి అట్టహాసంగా ముగిసాయి. పట్టణంలోని పెద్ద మసీదు వద్ద ఉన్న దర్గా నుంచి విశ్రాంతి భవనం వద్ద గల దర్గా వరకు గంధం ఊరేగింపు నిర్వహించారు.
ఉత్సవాలకు పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. కవాలి కార్యక్రమం ఆద్యంతం ఆకట్టుకుంది. దర్గా ప్రాంతంలో దుకాణాలు వెలువడడంతో పండుగ వాతావరణం నెలకొంది.