మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్లో సుందిళ్ల బ్యారేజ్ గేట్లు ఎత్తివేయడం వల్ల నీటి కుంటలో చేపలు పెద్ద ఎత్తున వచ్చాయి. సమాచారం తెలుసుకున్న 30 గ్రామాలు ప్రజలు తండోపతండాలుగా ప్రాజెక్టు వద్దకు చేరారు.
అక్కడ చేపలు పట్టుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్లో చేపలు పట్టుకునేందుకు జనాలు ఎగబడ్డారు. ఈ సంఘటన గ్రామ సమీపంలోని సుందిళ్ల బ్యారేజ్ దగ్గర చోటుచేసుకుంది.
అక్కడ చేపలు పట్టుకునేందుకు ప్రజలు పోటీపడ్డారు
కొందరు వల విసురుతూ, మరికొందరు చేతులు, చీరలతో చేపలు పట్టారు. వాటిని బస్తాలు, ట్రాక్టర్లు, ట్రాలీల్లో తీసుకు వెళ్లేందుకు పోటీ పడ్డారు. ప్రజల పెద్దఎత్తున చేరడం వల్ల బ్యారేజి కింద వాతావరణం జాతరలాగా కనిపించింది.
ఇదీ చూడండి :'కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం విఫలం'