మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎంఈవో రాధాకృష్ణమూర్తి ఇంట్లో చోరీ జరగడం చర్చనీయాంశమైంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు కుటుంబ సభ్యులతో కలిసి నిన్న ఉదయం హైదరాబాదుకు వెళ్లారు. ఈ రోజు తిరిగి ఇంటికి వచ్చి చూడగా... తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా... దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
చెన్నూరు ఎంఈవో ఇంట్లో చోరీ - latest news of thefting in house of meo
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎంఈవో ఇంట్లో చోరి జరిగింది. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వ అధికారి ఇంట్లోనే భద్రత లేకపోతే సామాన్యుల గతేంటంటూ ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు.

చెన్నూరు ఎంఈవో ఇంట్లో చోరీ
బీరువాలో ఉన్న లక్ష 60 వేల నగదు, 3 తులాల బంగారం, రూ. 70తులాల వెండి వస్తువులను అపహరించినట్లు ఎంఈవో తెలిపారు. బాధితుల సమాచారంతో అక్కడికి చేరుకున్న ఎస్సై విక్టర్... చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. ఇంటి పరిసరాలను డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో తనిఖీ చేశారు.
చెన్నూరు ఎంఈవో ఇంట్లో చోరీ
ఇదీ చూడండి: రాష్ట్రంలో ఇలాంటి దుశ్చర్యలను సహించబోం: కేసీఆర్