మంచిర్యాల జిల్లా రేచిని గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గురువారం అర్ధరాత్రి భార్యభర్తలపై దుండగులు కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిలో గజేల్లి పోశం అక్కడికక్కడే మరణించగా, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న భార్య శంకరమ్మను కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
దంపతులపై కత్తులతో ఎటాక్.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం - భార్యాభర్తలపై దుండగుల దాడి
అర్ధరాత్రి భార్యాభర్తలపై దుండగులు కత్తులతో దాడి చేశారు.. కారణం తెలియలేదు కానీ విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. దాడిలో భర్త అక్కడికక్కడే రక్తపు మడుగుల్లో మృతి చెందగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా రేచిని గ్రామంలో జరిగింది.
![దంపతులపై కత్తులతో ఎటాక్.. భర్త మృతి, భార్య పరిస్థితి విషమం The brutal murder of her husband wife matter is panic at rechini mancherial](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7775200-159-7775200-1593145750429.jpg)
భర్త దారుణ హత్య.. భర్య పరిస్థితి విషమం
భర్త దారుణ హత్య.. భర్య పరిస్థితి విషమం
సమాచారం తెలుసుకున్న తాండూరు సీఐ ఉపేందర్, ఎస్ఐ శేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. జాగిలంతో తనిఖీ చేశారు. హత్య ఎందుకు చేశారు? ఎవరు చేశారు? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు. మరో వైపు భూ తగాదాలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. రెండు రోజుల క్రితమే అన్నదమ్ముల మధ్య భూముల పంచాయితీ జరిగిందని తెలిసింది.
ఇదీ చూడండి :కామారెడ్డిలో దారుణ హత్యలు.. ఇద్దరిని నరికి చంపిన దుండగులు