తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా టీజీబీకేఎస్​ 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

టీజీబీకేఎస్​ 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లో వేడుకలు ఘనంగా జరిగాయి. సంఘం నాయకులు మల్లారెడ్డి.. కార్మిక జెండాను ఆవిష్కరించి, కార్మికులకు మిఠాయిలను పంచి పెట్టారు.

TGBK 19th anniversary Celebrations in mancherial
ఘనంగా టీజీబీకే 19వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

By

Published : Jan 27, 2021, 11:57 AM IST

తెరాస ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థ ఎంతో అభివృద్ధితో నూతన ఒరవడికి నాంది పలుకిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీజీబీకేఎస్​) నాయకులు మల్లారెడ్డి పేర్కొన్నారు. టీజీబీకేఎస్​ 19వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ఆయన మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్​లో కార్మిక జెండాను ఆవిష్కరించారు.

గత ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను.. కారుణ్య నియామకాల పేరిట, తిరిగి తమ వారసులకు కల్పించిన ఘనుడు కేసిఆర్ అంటూ మల్లారెడ్డి కొనియాడారు. తెరాస ప్రభుత్వం.. కార్మికుల అభిమానాన్ని చూరగొందని వివరించారు.

ఇదీ చదవండి:రాజన్న ఆలయంలో ముస్లిం మహిళ కోడె మొక్కులు

ABOUT THE AUTHOR

...view details