తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆధ్వర్యంలో సాదాసీదాగా నిర్వహించారు. ఈ సందర్భంగా బైపాస్ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులకు నివాళులు అర్పించారు.
మంచిర్యాలలో తెరాస ఆవిర్భావ వేడుకలు - cm kcr
మంచిర్యాలలో తెరాస ఆవిర్భావ దినోత్సవం నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం అమరులైన వీరులకు ఎమ్మెల్యే దివాకర్‌రావు నివాళులు అర్పించారు.
మంచిర్యాలలో తెరాస ఆవిర్భావ వేడుకలు
కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించినట్లు దివాకర్‌రావు పేర్కొన్నారు. తెరాస ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తోందని అన్నారు. ప్రజల సంక్షేమం కోసమే తమ పార్టీ అనునిత్యం పని చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చూడండి:పింఛన్‌దారులకు కరోనా వస్తే పరిస్థితేంటి..?