రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మనవరాలు ఏం తింటున్నారో.. మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అవే బియ్యంతో భోజనం అందజేస్తున్నామని రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించిన ఆమె.. తాండూర్లో ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
'తెలంగాణ విద్యార్థులు వెనకపడొద్దనే ఈ నిర్ణయం' - mancherial district news
తెలంగాణ విద్యార్థులు చదువులో వెనకపడొద్దనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించారని రాష్ట్ర గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో పర్యటించిన ఆమె.. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
బెల్లంపల్లి పట్టణంలో డీఎంఎఫ్టీ నిధులతో నిర్మించిన పాఠశాల భవనాన్ని మంత్రి సత్యవతి ప్రారంభించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యార్థులు వెనకపడొద్దనే సీఎం కేసీఆర్ పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించారని తెలిపారు. విద్యాసంస్థల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని పాఠశాలలను అప్గ్రేడ్ చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో.. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నల్ల భాగ్యలక్ష్మి, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సత్యనారాయణ పాల్గొన్నారు.
- ఇదీ చూడండి :11మంది ఉండాల్సింది.. ఇద్దరితోనే నడిపిస్తున్నారు