మంచిర్యాల జిల్లాలోని శ్రీ పాద ఎల్లంపల్లి జలాశయాన్ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్, ఎమ్మెల్యే దివాకర్ రావు సందర్శించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత ఎల్లంపల్లి జలాశయం వద్ద సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుందని ఉప్పల శ్రీనివాస్ అన్నారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందేలా
తెలంగాణలో పర్యాటక వనరులు అధికంగా ఉన్నాయని.. వాటికి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పరిస్తే అంతర్జాతీయంగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. అతి త్వరలోనే 100 మంది ప్రయాణించేలా డబుల్ డెక్కర్ బోట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.