మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ 2020-21 పోటీలను ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 క్రికెట్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షతన ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి క్రికెట్ పోటీలు ప్రారంభం - తెలంగాణ వార్తలు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 12 జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. యువత చెడు వ్యసనాలకు గురికాకుండా ఉండేందుకే క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ జాగృతి క్రికెట్ కప్ పోటీలు ప్రారంభం
యువత చెడు వ్యసనాలకు గురికాకుండా, ఐకమత్యంతో ఉండేందుకే క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. విద్య, క్రీడా రంగాల్లో రాణించి ఉన్నత ఉద్యోగాలను సాధించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి:రజనీ రాజకీయ నిర్ణయంపై అభిమానుల నిరసన