మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రైల్వే రడగంబాల బస్తీకి చెందిన నాదిర్షా నక్వి సింగరేణిలో కొంతకాలం క్లర్క్‌గా పని చేశారు. ఆది నుంచి సమాజ సేవకు అధిక ప్రాధాన్యత నిచ్చే నక్వి...ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సమాజంలో మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించేవారు. పదవీ విరమణ అనంతరం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. హజారే పాటలను అద్భుతంగా పాడగలరు. అమ్మాయి బొమ్మతో పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్నారు.
తెలంగాణ అన్నాహజారేను చూశారా...?
పదవీ విరమణ తర్వాత మంచి ఇల్లు కట్టుకుని... తీర్థయాత్రలకు తిరుగుతూ... నచ్చిన వ్యాపకాలతో గడిపేయడం సాధారణ వ్యక్తులు చేసే పని. కానీ సమాజ సేవే ఊపిరిగా.. పకృతి రక్షణే ఆశయంగా బతుకుతూ తెలంగాణా అన్న హజారేగా గుర్తింపు తెచ్చుకున్నారు బెల్లంపల్లికి చెందిన నాదిర్ షా నక్వి.
తెలంగాణ అన్నాహజారేను చూశారా...?
పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించే నక్వి ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను పెంచుతున్నారు. పక్షుల సంరక్షణ కూడా నక్వికి ప్రాణం. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే చేసిన దీక్షలో ఆయనతోపాటు పాల్గొన్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగారు. డబ్బులు తీసుకుని ఓటేయద్దంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇదీ చూడండి: 'కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి'
Last Updated : Dec 10, 2019, 11:36 PM IST