మంచిర్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో ఉపాధ్యాయులు తమకు వేతనాలు చెల్లించడం లేదని నిరసన వ్యక్తం చేస్తూ... విధులు బహిష్కరించారు. కరోనా విపత్కర సమయంలో ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు బోధించామని... ప్రస్తుతం ఆఫ్లైన్ ద్వారా ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నామని పేర్కొన్నారు.
విధులు బహిష్కరించి.. ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు - teachers protest news
మంచిర్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు విధులు బహిష్కరించారు. తమకు వేతనాలు చెల్లించడం లేదని... నిరసన వ్యక్తం చేశారు.
విధులు బహిష్కరించి.. ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు
ఇప్పటివరకు 7 నెలల నుంచి తమకు వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను శ్రమ దోపిడీకి గురి చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ.. ఇప్పటికైనా తమకు వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.