ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. నియోజకవర్గ అధ్యక్షుడు సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనకు తెదేపా నాయకులు, కళాకారులు ఘనస్వాగతం పలికారు. జయశంకర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఎల్.రమణ - తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ తాజా వార్తలు
మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిర్వహించిన బహిరంగ సభకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాయకులు, కళాకారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ముఖ్యమంత్రి మార్చారని ఆయన మండిపడ్డారు.

ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి: ఎల్.రమణ
తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేత ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని విమర్శించారు. కార్మికులు, కర్షకులు, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెదేపా నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: ఖమ్మం గెలిస్తే తెలంగాణ గెలుస్తాం... కాంగ్రెస్ శంఖారావం..