అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం నుంచి కన్నెపల్లి మండలానికి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు పాగా వేసి పట్టుకున్నారు. బెల్లంపల్లి, కన్నెపల్లి మధ్యలో టాస్క్ఫోర్స్ సీఐ సతీష్, ఎస్ఐ కుమారస్వామి ఆధ్వర్యంలో తనిఖీ చేపట్టారు. వాహనంలో రూ. 3.50 లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని గుర్తించారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారీగా అక్రమ మద్యం పట్టివేత - భారీగా అక్రమ మద్యం పట్టివేత
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సమీపంలో అక్రమ మద్యాన్ని సరఫరాల చేస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. వారి నుంచి రూ.3.50 లక్షల విలువ చేసే అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
భారీగా అక్రమ మద్యం పట్టివేత