సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని.. కారు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి - కారు ప్రమాదంలో ముగ్గురు మృతి వార్తలు
ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టిన ఘటనలో మంచిర్యాల జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు తాండూరు సర్పంచ్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లారీని ఢీకొట్టిన కారు... సర్పంచ్ సహా ఇద్దరు మృతి
మృతులు మంచిర్యాల జిల్లాలోని తాండూరు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఒకరైనా అంజిబాబు సర్పంచ్ అని.... మిగిలిన ఇద్దరు అతని మిత్రులు సాయిప్రసాద్, గణేశ్‌గా గుర్తించారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:పబ్జీతో వ్యక్తిగత గోప్యతకే కాదు ఆరోగ్యానికీ ముప్పే!