మంచిర్యాల జిల్లా మందమర్రిలో అర్ధరాత్రి రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్వయంగా ద్విచక్ర వాహనం నడుపుకుంటూ సింగరేణి కార్మికవాడల్లో తిరుగుతూ బందోబస్తును పరిశీలించారు. అనవసరంగా రహదారులపై తిరుగుతున్న పలువురిని మందలించి చెదరగొట్టారు. మందమర్రి పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు పోలీసులు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని సీపీ సత్యనారాయణ అన్నారు.
మందమర్రిలో డీఐజీ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ - CP Checking Mandamarri
మందమర్రిలో లాక్‌డౌన్ అమలు తీరుపై రామగుండం సీపీ సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు. అర్ధరాత్రి వేళ ద్విచక్రవాహనంపై వీధివీధి తిరుగుతూ బందోబస్తును పరిశీలించారు.
సీపీ తనిఖీలు