తెలంగాణ

telangana

ETV Bharat / state

సుభాషిణి మేడమే కావాలి: విద్యార్థినుల ధర్నా - నాణ్యమైన విద్య, భోజన వసతులు

ప్రిన్సిపల్​ బదిలీని రద్దు చేయాలని విద్యార్థినులు పాఠశాల ముందు బైఠాయించిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకుంది. ప్రిన్సిపల్​ విధి నిర్వహణలో లోపాలు లేవని.. నాణ్యమైన విద్య, భోజన వసతులు కల్పిస్తున్నారని కొనియాడారు. తమకు సుభాషిణి మెడమే కావాలని పట్టుబట్టారు.

సుభాషిణి మేడమే కావాలి: విద్యార్థునుల ధర్నా

By

Published : Aug 24, 2019, 11:20 PM IST

సుభాషిణి మేడమే కావాలి: విద్యార్థునుల ధర్నా
ప్రధానోపాధ్యాయురాలి బదిలీని రద్దుచేయాలని విద్యార్థినులు ధర్నా చేపట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని తెలంగాణ సాంఘిక బాలికల గురుకుల పాఠశాల (వసతిగృహం) ప్రిన్సిపల్ సుభాషిణి ఆకస్మిక బదిలీకి నిరసన తెలిపారు. పాఠశాల ప్రధాన ద్వారం ఎదురుగా బైఠాయించి నినాదాలు చేశారు. ఆమె విధి నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవని.. నాణ్యమైన విద్య, భోజన వసతులు కల్పిస్తున్నారన్నారు. ఉన్నతాధికారులు పునరాలోచించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details