జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలను బెల్లంపల్లికి తరలించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. మంచిర్యాల జిల్లా తాండూరు మండలానికి మంజూరైన జ్యోతిబాపూలే గురుకుల బాలుర పాఠశాలను ఇష్టానుసారంగా తరలించడం సరికాదని మండిపడ్డారు. తాండూరులో పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తాండూరు ఐబీలో విద్యార్థి సంఘాల నాయకులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. కిందకు దిగలేదు.
నీళ్ల ట్యాంకు ఎక్కి విద్యార్థి సంఘాల నిరసన - బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా తాండూరు ఐబీలో విద్యార్థి సంఘాల నాయకులు నీళ్ల ట్యాంకు ఎక్కి నిరసన చేపట్టారు. జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను బెల్లంపల్లికి తరలించడంపై ఆందోళన చేశారు.
నీళ్ల ట్యాంకు ఎక్కి విద్యార్థి సంఘాల నిరసన