మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కన్నెపల్లి ప్రాథమిక పాఠశాల ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యుటేషన్‌పై(teachers deputation process in telangana) వేరే పాఠశాలకు పంపడం ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అధికారుల నిర్ణయాన్ని నిరసిస్తూ... విద్యార్థులు, తల్లిదండ్రులు జాతీయ రహదారిపై ధర్నా(student strike at kannepalli) చేపట్టారు. ఆ ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఏడు తరగతుల్లో మొత్తం 70 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం ఐదుగురు ఉపాధ్యాయులు ఉండగా... సర్దుబాటు చేసే పక్రియలో భాగంగా ఇద్దరిని రెబ్బనపల్లి పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపించడానికి ఆర్డర్స్ ఇచ్చారు.
ఎంఈవో స్పందన
ఈ విషయం తెలుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువులకి ఇబ్బంది కలగకుండా చూడాలని స్థానిక జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. అనంతరం ఉపాధ్యాయులను పాఠశాల గదిలో బంధించి.. తాళం వేసి నిరసన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని... డిప్యూటేషను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుకున్న స్థానిక మండల విద్యాధికారి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు పరిస్థితిని వివరించారు. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉన్నందున ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై(teachers deputation process in telangana) వేరే పాఠశాలకు కేటాయించారని వివరించారు. మొత్తం విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు అయ్యాక... ఆ టీచర్ల డిప్యూటేషన్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన(student strike at kannepalli) విరమించారు.