మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ వాహనానికి నిబంధనలకు విరుద్ధంగా స్టిక్కర్ అతికించారు. ఈ-చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్‌పై అదనపు పాలనాధికారి అని రాసి ఉన్న స్టిక్కర్ వేశారు.
జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మంచిర్యాల నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అధిక వేగం కారణంగా స్పీడ్ గన్‌కు చిక్కుతున్నారు. ఫలితంగా పోలీసులు ఈ-చలాన్ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు.