తెలంగాణ

telangana

ETV Bharat / state

జన సందోహం లేకుండానే జానకి రాముడి కల్యాణం - SEETHAA RAMULA WEDDING DAY

మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో శ్రీ సీతా రాముల కల్యాణ వేడుక నిరాడంబరంగా జరిగింది. లోక కల్యాణం కోసం వివాహాన్ని జరిపించి... సర్వ మానావాళికి సుఖశాంతులను అందించాలని కోరినట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు.

సర్వమానవాళి సంతోషంగా ఉండాలి : అర్చకులు
సర్వమానవాళి సంతోషంగా ఉండాలి : అర్చకులు

By

Published : Apr 2, 2020, 8:49 PM IST

మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయంలో నిరాడంబరంగా సీతారాముల కల్యాణం నిర్వహించారు. కరోనా వైరస్ కలకలం నేపథ్యంలో పోలీసుల ఆంక్షలు నడుమ భక్తుల కోలాహలం లేకుండానే వేడుక జరిపించారు. సుమారు గంటన్నర పాటు ఈ వివాహ క్రతువు కొనసాగింది. అనంతరం దేవతా మూర్తులకు ప్రత్యేక హారతులు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details