మంచిర్యాల జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో జిల్లా ప్రజలు కొవిడ్ బారిన పడకుండా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో.. సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేసే యంత్రాలను మున్సిపల్ ఛైర్మన్ రాజయ్య, కమిషనర్ స్వరూపారాణి ప్రారంభించారు. కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాలుస్తుండగా.. ఈ చర్యలు చేపట్టినట్లు పురపాలక అధికారులు వెల్లడించారు.
రద్దీ ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి - తెలంగాణ తాజా వార్తలు
కరోనా సెకండ్ వేవ్ ఉగ్రరూపం దాల్చుతున్న తరుణంలో మంచిర్యాల జిల్లా ప్రజలను మహమ్మారి నుంచి కాపాడడానికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చర్యలకు సిద్ధమయ్యారు. సోడియం హైపో ఫ్లోరైడ్ ద్రావణం పిచికారిని మున్సిపల్ ఛైర్మన్ రాజయ్య, కమిషనర్ స్వరూపారాణి ప్రారంభించారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి, మాస్కులు ధరించి అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించారు.
రద్దీ ప్రాంతాల్లో హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి
పురపాలక సిబ్బంది పట్టణంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారి చేశారు. గతేడాది మంచిర్యాలలోని 36 వార్డుల్లో ఇంటింటికి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేశామని పురపాలక కమిషనర్ స్వరూపరాణి తెలిపారు. ఈసారి కూడా పట్టణంలోని రద్దీ ప్రాంతాల్లో నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్నామని వివరించారు. జిల్లాను కరోనా రహితంగా మార్చేందుకు ప్రజలు సహకరించాలని పురపాలక కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :'80 శాతం మందిలో లక్షణాల్లేవ్.. కానీ ప్రమాదకరమే'