యూపీఎస్సీ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన శిరిశెట్టి సంకీర్త్ 330వ ర్యాంకు సాధించాడు. మూడుసార్లు విఫలమైన వెనక్కు తగ్గకుండా నాలుగోసారి లక్ష్యాన్ని చేరుకున్నాడు. చిన్నప్పటి నుంచి తల్లి నిర్వహిస్తున్న పాఠశాలలోనే పది తరగతి వరకు చదివాడు.
అమ్మ పాఠశాలలో చదివి... సివిల్స్ కొట్టాడు.. - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు
కన్నతల్లి పాఠశాలలోనే చిన్నతనం నుంచి పది వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్ సాధించి సత్తా చాటాడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన యువకుడు.
అమ్మ పాఠశాలలో చదివి... సివిల్స్ కొట్టాడు..
తండ్రి సత్యనారాయణ సింగరేణిలో ఎలక్ట్రికల్‌గా, తల్లి ప్రైవేట్ పాఠశాలకు ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. సివిల్స్‌లో ర్యాంకు రావడంతో సంకీర్త్ సంతోషం వ్యక్తం చేశాడు.