తెలంగాణ

telangana

ETV Bharat / state

సింగరేణి యువ కార్మికుల ఆధ్వర్యంలో నిత్యాసరాల పంపిణీ - ఆటో డ్రైవర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన ఆర్‌కే-06 సింగరేణి గని యువ కార్మికులు

మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో లాక్‌డౌన్‌తో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న ఆటోడ్రైవర్లకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు ఆర్‌కే-06 సింగరేణి గని యువ కార్మికులు.

rk-06 union young workers help to auto drivers
సింగరేణి యువ కార్మికుల ఆధ్వర్యంలో నిత్యాసరాల పంపిణీ

By

Published : Apr 26, 2020, 7:41 PM IST

లాక్‌డౌన్ కారణంగా మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ పరిసర ప్రాంతాల్లో ఉపాధి లేక ఆకలితో అలమటిస్తోన్న 50 మంది ఆటో డ్రైవర్లను ఆర్‌కే-06 సింగరేణి గని యువ కార్మికులు ఆదుకున్నారు. సింగరేణి కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజి రెడ్డి చేతుల మీదుగా నిత్యావసరాలు పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆకలితో అలమటిస్తోన్న పేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సింగరేణి యువ కార్మికులు చేస్తున్న సేవా కార్యక్రమాన్ని ఆయన ప్రశంసించారు.

ఇదీ చూడండి:కుష్టు వ్యాధి వ్యాక్సిన్​తో కరోనా చికిత్స!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details