సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా కేకే 5 గని వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సింగరేణిలో ప్రైవేటీకరణ నిలిపివేయాలని.. కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య డిమాండ్ చేశారు.
'సింగరేణి కార్మిక సమస్యలు పరిష్కరించాలి' - singareni workers protest
తమ సమస్యలు పరిష్కరించాలంటూ సింగరేణి కార్మికులు మంచిర్యాల జిల్లా మందమర్రిలో ధర్నా నిర్వహించారు.
!['సింగరేణి కార్మిక సమస్యలు పరిష్కరించాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3853100-thumbnail-3x2-vysh.jpg)
'సింగరేణి కార్మిక సమస్యలు పరిష్కరించాలి'
TAGGED:
singareni workers protest