ముఖ్యమంత్రి కేసీఆర్ నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని సింగరేణి కార్మికులు కోరుకున్నారు. ఆయన పుట్టినరోజు వేడుకలను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి గనులపై నిర్వహించారు. విధులకువెళ్లే ముందు కేక్ కట్ చేసి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్ఆర్పీ 3వ గని ఆవరణలో అధికారులు, కార్మికనాయకులతో కలిసి మొక్కలు నాటారు.
సింగరేణిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింగరేణి కార్మికులు శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేళ్లు ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. హరితహారంలో భాగంగా సింగరేణి కోటి మొక్కలు నాటిందని పేర్కొన్నారు.
![సింగరేణిలో కేసీఆర్ జన్మదిన వేడుకలు Singareni workers organized the birthday of CM KCR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10658875-289-10658875-1613540937715.jpg)
సీఎం కేసీఆర్ పుట్టినరోజును నిర్వహించిన సింగరేణి కార్మికులు
హరితహారంలో భాగంగా సింగరేణి ఇప్పటికే కోటి మొక్కలు నాటిందని కార్మికులు తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని నాటిన మొక్కలను సంరక్షించి పచ్చదనాన్ని పెంపొందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తరువాత కారుణ్యనియామకాల పేరుతో తమ వారసులకు ఉద్యోగాలిచ్చారని అన్నారు.
ఇదీ చదవండి:సీఎం కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ