తెలంగాణ

telangana

ETV Bharat / state

కవితకు అభినందనలు తెలుపుతూ బొగ్గుగని సంఘం నాయకుల సంబురాలు - మంచిర్యాలలో సింగరేణి కార్మికుల సంబురాలు

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో ఘన విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు అభినందనలు తెలుపుతూ... మంచిర్యాల జిల్లాలో బొగ్గుగని కార్మికులు సంబురాలు చేసుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచారు.

కవితకు అభినందనలు తెలుపుతూ బొగ్గుగని సంఘం నాయకుల సంబురాలు
కవితకు అభినందనలు తెలుపుతూ బొగ్గుగని సంఘం నాయకుల సంబురాలు

By

Published : Oct 12, 2020, 5:26 PM IST

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంలో కల్వకుంట్ల కవిత ఎంతో కృషి చేశారని తెలంగాణ బొగ్గుగని సంఘం నాయకులు పేర్కొన్నారు. నిజామాబాద్​ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన కవితకు అభినందనలు తెలుపుతూ మంచిర్యాలలో బొగ్గుగని సంఘం నాయకులు సంబురాలు చేసుకున్నారు.

తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా కల్వకుంట్ల కవిత... కార్మికుల సంక్షేమం కోసం పార్లమెంట్​లో పోరాడారని శ్రీరాంపూర్ టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి అన్నారు. తమ నాయకురాలికి మంత్రి పదవి ఇస్తే సింగరేణి కార్మికులకు మరింత మేలు జరుగుతుందన్నారు.

ఇదీ చూడండి: దోమలపై దండయాత్రకు.. జీహెచ్​ఎంసీ కొత్త ఎత్తుగడ

ABOUT THE AUTHOR

...view details