సింగరేణి... మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. 220 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంటులో 5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తొలి ప్లాంటు అందుబాటులోకి వచ్చింది. 33 కేవీ పవర్ లైనుకు అనుసంధానం చేసి సోలార్ విద్యుత్ ఉత్పాదన రంగంలో అడుగుపెట్టింది. దేశంలోనే థర్మల్, సోలార్ విద్యుదుత్పాదన చేస్తున్న తొలి బొగ్గు కంపెనీగా.. సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.
మరో శిఖరానికి చేరుకున్న సింగరేణి
సింగరేణి సిగలో మరో ఘనత నమోదైంది. 220 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంటులో 5 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తొలి ప్లాంటును అందుబాటులోకి తెచ్చింది.
మరో శిఖరానికి చేరుకున్న సింగరేణి
మంచిర్యాల జిల్లా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిర్మాణం పూర్తైన తొలిదశ 5 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును.. శుక్రవారం గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. సౌరవిద్యుత్ రంగంలోకి అడుగుపెట్టడంపై సింగరేణి సీఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తంచేశారు. ఇందుకోసం కృషి చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఇవీ చూడండి: 21 వేల 850 నామినేషన్లు.. నేడు పరిశీలన