భారత్లోనే అత్యంత ఉన్నతమైన ప్రమాణలతో కూడిన సేఫ్టీ మేనేజ్ మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఏర్పాటు చేశారు. రెండు కోట్లతో నిర్మించిన ఈ సింటార్స్ భవనాన్ని మైన్స్ సేఫ్టీ డైరెక్టర్ జనరల్ ఆర్. సుబ్రమణియన్ హైదరాబాద్ నుంచి రిమోట్ కంట్రోలర్ ద్వారా ప్రారంభించారు.
మందమర్రిలో సేఫ్టీ మేనేజ్మెంట్ శిక్షణ కేంద్రం - మంచిర్యాల జిల్లా వార్తలు
అత్యంత ఉన్నత ప్రమాణాలతో మంచిర్యాల జిల్లా మందమర్రిలో సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఇది అంతర్జాతీయ శిక్షణ ప్రమాణాలతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని మందమర్రి ఏరియా జీఎం రమేశ్ రావు తెలిపారు.
మందమర్రిలో సేఫ్టీ మేనేజ్మెంట్ శిక్షణ కేంద్రం
ఆస్ట్రేలియాలోని సేఫ్టీ మైన్స్ టెస్టింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ అనుబంధంగా ఈ సింటార్స్ భవనం నిర్వహించబడుతుందని.. మందమర్రి ఏరియా జీఎం రమేశ్ రావు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశంలోని బొగ్గు గనులలో ఎక్కడ లేనివిధంగా సెంట్రల్ ఫైర్ సిస్టం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ