మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని సింగరేణి డైరెక్టర్ బలరాం పరిశీలించారు. కరోనాపై పోరులో ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఐసోలేషన్ కేంద్రంలో కొవిడ్ రోగులకు భోజన సదుపాయంతో పాటు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
కరోనాపై పోరులో ప్రభుత్వానికి సింగరేణికి సాయం - singareni helps to telangana government
కరోనాపై పోరులో సింగరేణి సంస్థ ప్రభుత్వానికి పూర్తిగా అండగా ఉంటుందని సింగరేణి డైరెక్టర్ బలరాం చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాన్ని పరిశీలించారు.
సింగరేణి డైరెక్టర్, సింగరేణి డైరెక్టర్ బలరాం, తెలంగాణ ప్రభుత్వానికి సింగరేణి సాయం, తెలంగాణ కరోనా కేసులు, మంచిర్యాల జిల్లా వార్తలు, మంచిర్యాలలో కరోనా వ్యాప్తి
ఆస్పత్రిలో సౌకర్యాల మెరుగుతో పాటు సిబ్బంది నియామకం విషయంలో స్థానిక జీఎంకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు బలరాం స్పష్టం చేశారు. కరోనా కష్టకాలంలో సింగరేణి సంస్థ ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు. కొవిడ్ కేంద్రంలోకి ఇతరులు ఎవరూ రావద్దని సూచించారు. రోగులను చూడాలనే ఉద్దేశంతో రావడం వల్ల వారికీ కరోనా సోకే అవకాశం ఉందని చెప్పారు.