మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నెల నుంచి జులై నెల వరకు 91.74 శాతం పి.ఎల్.ఎఫ్ సాధించి సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో ఐదో స్థానంలో నిలిచింది. 96.46 శాతం పి.ఎల్.ఎఫ్‌తో బుడ్గె బుడ్గె (పశ్చిమ బంగాల్) థర్మల్ విద్యుత్ కేంద్రం మొదటి స్థానంలో, 96.30 శాతంతో తాల్చేరు (ఎన్టీపీసీ-ఒడిస్సా) థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వితీయ స్థానంలో, 94.34 శాతంతో సాంతాల్దీహ్(పశ్చిమ బంగాల్) థర్మల్ విద్యుత్ కేంద్రం మూడో స్థానంలో, 93.87 శాతంతో ససాన్ (రిలయన్స్ - మధ్యప్రదేశ్) థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగో స్థానంలో నిలిచాయి.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం @ నెం.5 - SINGARENI _NO.5 PLACE IN NATIONAL LEVEL
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం మరోసారి జాతీయ స్థాయిలో ప్రతిభను చాటింది. నాలుగు నెల్లల్లో 91.74 శాతం పి.ఎల్.ఎఫ్ సాధించి దేశంలోనే 5వ స్థానంలో నిలిచింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతీయ స్థాయిలో 5వ స్థానంలో నిలవడం రెండోసారి కావడం విశేషం.
SINGARENI _NO.5 PLACE IN NATIONAL LEVEL
రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చడంలో భాగంగా సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అత్యధిక పి.ఎల్.ఎఫ్‌తో విద్యుత్‌ను అందిస్తూ... పురోగమించడంపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ప్లాంటులోని ఉద్యోగులు, అధికారులకు తన అభినందనలు తెలిపారు. ఇదే ఒరవడితో మంచి ఉత్పాదకతతో పనిచేస్తూ జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలవడానికి కృషి చేయాలని కోరారు.
ఇవీ చూడండి: గజ్వేల్ హోటల్లో కే'టీ'ఆర్ బ్రేక్
Last Updated : Aug 22, 2019, 8:06 AM IST