తెలంగాణ

telangana

ETV Bharat / state

Singareni Accident: సింగరేణి ఘటన బాధ్యులపై యాజమాన్యం చర్యలు

సింగరేణి కార్మికుల ప్రాణాలు కోల్పోయిన ఘటన(Singareni Accident) బాధ్యులపై యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదానికి బాధ్యులైన ముగ్గురిని సస్పెండ్ చేసింది. మృతుల కుటుంబీకులకు వారం రోజుల్లోగా ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది.

Singareni Accident, Singareni coal mine
సింగరేణి బొగ్గుగనిలో ప్రమాదం, సింగరేణి కంపెనీ వార్తలు

By

Published : Nov 12, 2021, 7:25 PM IST

సింగరేణి బొగ్గుగనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు దుర్మరణం చెందిన ఘటనలో(Singareni Accident) సింగరేణి యాజమాన్యం(singareni coal mine) చర్యలకు ఉపక్రమించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ మండలం శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఎస్సార్పీ-3 గనిలో పైకప్పు కూలి(Singareni Accident) నలుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ డిప్యూటీ మేనేజర్, ఇద్దరు సూపర్‌ వైజర్లను యాజమాన్యం సస్పెండ్‌ చేసింది. గని మేనేజర్‌కు ఛార్జషీట్‌ జారీ చేసింది. వారంలోగా మృతుల కుటుంబీకులకు ఉద్యోగాలు ఇస్తామని యాజమాన్యం వెల్లడించింది.

ప్రమాదంలో చనిపోయిన కార్మికులు

ఉపేక్షించేది లేదు

సింగరేణి ఉద్యోగులు, కార్మికుల రక్షణపై అలసత్వంతో వ్యవహరించే వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదని సింగరేణి యాజమాన్యం(singareni coal mine) హెచ్చరించింది. గని ప్రమాదం(Singareni Accident) విషయంలో ఇంత వేగంగా చర్యలు చేపట్టడం సింగరేణి(singareni coal mine) చరిత్రలో ఇదే ప్రథమమని అధికారులు తెలిపారు. సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే తక్షణ విచారణకు ఆదేశించారన్నారు. పర్సనల్‌, ప్రాజెక్ట్స్ అండ్‌ ప్లానింగ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరామ్​ను తక్షణమే గనికి వెళ్లి ప్రాథమిక విచారణ జరిపి నివేదిక అందించాలని సీఎండీ ఆదేశించారు. అధికారిక పర్యటనలో ముంబయిలో ఉన్న ఎన్‌.బలరామ్‌ హుటాహుటిన వెనక్కి వచ్చి ఈనెల 11న ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద తీరుపై ఆరా తీశారు.

కఠిన చర్యలే..

ఈ ఘటనపై((Singareni Accident) సమగ్ర విచారణ కొనసాగించే క్రమంలో ప్రాథమికంగా బాధ్యులుగా గుర్తించిన ముగ్గురుని తక్షణమే సస్పెండ్‌ చేయాలని, మేనేజర్​కు ఛార్జిషీట్‌ ఇవ్వాలని యాజమాన్యం నిర్ణయించింది. రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉత్పత్తి సాధించాలని డైరెక్టర్ బలరామ్‌ స్పష్టం చేశారు. రక్షణ పెంపుదలకు పరిమితులు లేకుండా నిధులు కూడా మంజూరు చేస్తున్నామని, రక్షణపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రక్షణ విషయంలో పొరపాట్లు కార్మికుల విలువైన ప్రాణాలను హరిస్తున్నాయని అన్నారు. ఈ విషయంలో అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా ఉండే వారిపట్ల యాజమాన్యం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. అధికారులు, కార్మికులు అనే తేడా లేకుండా చర్యలు కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు.

రక్షణపై స్పెషల్ ఫోకస్

రక్షణ విషయంలో మరింత శ్రద్ధతో చర్యలు తీసుకోవాలని సింగరేణివ్యాప్త గనుల అధికారులు, ఉద్యోగులకు సూచించారు. గని ప్రమాదంలో మృతి చెందిన నలుగురు కార్మికుల పట్ల ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన యాజమాన్యం... ఈనెల 11న కంపెనీ పరంగా అందాల్సిన ఎక్స్‌గ్రేషియాను అందజేసింది. మిగిలిన మ్యాచింగ్‌ గ్రాంట్‌, ఇతర ప్రయోజనాలను వీలైనంత త్వరగా అందజేయడానికి యాజమాన్యం సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. మృతుల కుటుంబీకుల్లో అర్హులైన ఒకరికి వారం రోజుల్లోగా ఉద్యోగం కల్పించనున్నట్లు సీఎండీ తెలిపారు. ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నియామక ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని, వారం లోగా ఉద్యోగ నియామక పత్రాలు అందించడమే కాకుండా వారు కోరుకున్న ఏరియాలో పోస్టింగులు కూడా ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ బలరామ్‌ వివరించారు.

ఇదీ చదవండి:Singareni: సింగరేణి గనిలో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details