తెలంగాణ

telangana

ETV Bharat / state

బెల్లంపల్లిలో 30 కరోనా కేసులు.. ఆందోళనలో కార్మికులు - Singareni labours strike for corona

మంచిర్యాల జిల్లాలోని సింగరేణిలో కరోనా కలకలం రేపుతోంది. బెల్లంపల్లి శాంతిఖనిలో ఏడుగురు కార్మికులకు కరోనా రావటం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యం కార్మికులకు పూర్తి భద్రత కల్పించటం లేదని ఆరోపించారు. గనిలో సంపూర్ణ లాక్​డౌన్ విధించాలని డిమాండ్ చేశారు.

Singareni labours strike for corona in Manchiryala Minings
సింగరేణి కార్మికులకు కరోనా భయం

By

Published : Jun 29, 2020, 11:35 AM IST

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతిఖని వద్ద సింగరేణి కార్మికులు ఆందోళనకు దిగారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కనీస చర్యలు చేపట్టడం లేదని నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో ఆదివారం ఒక్కరోజే 33 కేసులు నమోదు కాగా బెల్లంపల్లిలోనే 30 కేసులు నమోదవడం గమనార్హం. అందులో ఏడుగురు శాంతిఖని కార్మికులు ఉన్నారు. దీనివల్ల గనిలోని కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పాజిటివ్ ఉన్న కార్మికులు నిన్నటి వరకు విధులకు హాజరు కావటం వల్ల భయాందోళన వ్యక్తం చేశారు. నమూనాలు ఇచ్చిన కార్మికులను ఎలా విధుల్లోకి తీసుకున్నారని కార్మిక సంఘం నాయకులు ప్రశ్నించారు. గనిలో సంపూర్ణ లాక్​డౌన్ విధించాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details