మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి 132వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జీఎం లక్ష్మీ నారాయణ హాజరయ్యారు. సింగరేణి పతాకాన్ని ఎగురవేసి.. ఉత్తమ కార్మికులకు బహుమతులను అందించారు.
శ్రీరాంపూర్‌లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
సింగరేణి 132వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జీఎం లక్ష్మీ నారాయణ హాజరయ్యారు.
వంద సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ.. అక్కున చేర్చుకుంటోందని అన్నారు. ఒకే గమ్యం ఒకే లక్ష్యం ఒకే కుటుంబం అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని... కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి:అగ్రిగోల్డ్ ప్రమోటర్లకు రిమాండ్.. చంచల్‌గూడకు నిందితులు