మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ప్రగతి మైదానంలో సింగరేణి 130వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏరియా జీఎం లక్ష్మీనారాయణ జెండా ఆవిష్కరించారు.
'ప్రభుత్వ చొరవతో సింగరేణి లాభాల బాట పట్టింది' - శ్రీరాంపూర్‌లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవం
అధునాతన యంత్రాలు ఉపయోగించి, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సింగరేణి సంస్థను లాభాల బాటలో పయనించేలా చేశామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా జీఎం లక్ష్మీనారాయణ అన్నారు.

ప్రభుత్వ చొరవతో సింగరేణి లాభాల బాట పట్టింది
ప్రభుత్వ చొరవతో సింగరేణి లాభాల బాట పట్టింది
ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని సింగరేణి సంస్థను లాభాల బాట పట్టించామని లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రభుత్వ చొరవతోనే సింగరేణి అభివృద్ధి సాధ్యమైందని వెల్లడించారు.
ప్రగతి మైదానంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు కార్మికులు కుటుంబ సభ్యులతో కలిసి రావాలని జీఎం కోరారు.
- ఇదీ చూడండి: మజిలీలో 'స్ట్రీట్ ఆఫ్ చెన్నై' సంగీత మాయాజాలం